SPOKEN ENGLISH - 9🏵
〰〰〰〰〰〰〰〰
'Be' forms are Three types.
Darsika: Where are your friends? Are they here?
(మీ స్నేహితులెక్కడ? వాళ్లిక్కడ ఉన్నారా?).
Deepika: They are. In fact they have been here for the past ten minutes. Is the coffee ready?
(ఇక్కడే ఉన్నారు. ఇప్పుడేంటి? గత పది నిమిషాలుగా ఇక్కడే ఉన్నారు. కాఫీ సిద్ధంగా ఉందా?)
(In fact = ముందన్నదానికి, విరుద్ధంగా ఏదైనా అంటున్నప్పుడు/ యథార్థంగా అనే అర్థంతో వాడతాం.)
Darsika: They were here last Sunday too, weren't they?
(వాళ్లు పోయిన ఆదివారం కూడా ఇక్కడ ఉన్నారు కదా?)
Deepika: Yea. They came here last Sunday to borrow some books from me. I gave them the books. They have come here to return the books.(కిందటి ఆదివారం నా దగ్గర కొన్ని పుస్తకాలు (అరువు) తీసుకునేందుకు వచ్చారు. నేను వాళ్లకు ఆ పుస్తకాలిచ్చాను. ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వడానికి వచ్చారు.)
Darsika: They seem to be good. When will they be here again?
(వాళ్లు మంచివాళ్లుగా కనిపిస్తున్నారు. మళ్లీ ఎప్పుడుంటారిక్కడ?)
Deepika: They may be here next Sunday too. I shall be happy to have them here frequently.
(వచ్చే ఆదివారం కూడా వాళ్లిక్కడ ఉండవచ్చు. వాళ్లిక్కడ తరచూ ఉండటం నాకు సంతోషంగా ఉంటుంది.)
Frequently = తరచుగా; rarely = అరుదుగా.
Darsika: How far is their place from here?
(వాళ్లిల్లు ఇక్కడికెంత దూరం?)
far = దూరం) ; near = దగ్గర; how far? = ఎంత దూరం?
Deepika: Not very far; about a kilometer and a half. They can be here in 15 minutes if they walk.
(పెద్దదూరం ఏం కాదు. దగ్గర దగ్గర కిలోమీటరున్నర. నడిచి వస్తే 15 నిమిషాల్లో ఇక్కడ ఉండగలరు.)
Darsika: But they have a vehicle, don't they? If they come on it, it should take much less than that.
(వాళ్లకేదో వాహనం ఉన్నట్టుంది కదా? దానిమీదైతే ఇంకా తక్కువ సమయం పట్టాలి.)
Deepika: It does. Get the Coffee then. I will call them.
(అవును. కాఫీ తీసుకురా. వాళ్లను పిలుస్తాను నేను.)
Look at the following sentences:
1) They have been here for the past ten minutes.
2) They came here last Sunday to barrow some books.
3) I gave them the books.
4) When will they be here again?
5) They maybe here again next week.
6) I shall be happy.
7) They can be here in ten minutes if they walk.
8) It should take much less than that.
9) I will call them.
పైన underline (bold) చేసిన మాటలన్నీ verbs.
(Verbs అంటే గుర్తుంది కదా? sentence లో Subjec తర్వాత sentence కు ఏమాట ముఖ్యమో అది verb.)
పై sentences లోని verbs చూద్దాం.
ఇప్పుడు మీరు తెలుసుకునే విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకుని గుర్తుంచుకోండి.
ఇవి మీకు గుర్తుంటే English మాట్లాడటం సులభం అవటమే కాకుండా, confusion ఉండదు.
A: have been, will be, maybe, shall be, can be.
B: came, barrow, gave, walk, should take, will call.
పైన A కింద తెలిపిన verbs, 'Be' forms. వీటి చివర 'be'/ 'been' వస్తుంది గమనించండి.
ఇలా 'be'/ 'been' చివర వచ్చే verbs ను 'be' forms అంటాం. 'Be' forms అంటే ఉండటం అని అర్థం వచ్చే verbs.
ఇంతకు ముందు చూశాం కదా? కొన్ని 'be' forms
1) am, is, are = ఇప్పుడు/ ఎప్పుడూ/ మామూలుగా/ సాధారణంగా ఉండటం.
2) was, were = గతంలో ఉండటం.
B కింద తెలిపిన verbs అన్నీ 'Active words' అంటే పనిని తెలిపే పదాలు. చూడండి.
e.g.: came = వచ్చాడు/ వచ్చాను/ వచ్చారు- పని.
అంటే English లో రెండు రకాల verbs ఉన్నాయన్నమాట.
1) Be forms: అన్ని 'be' forms కు అర్థాలు 'ఉండటం' అనే దాని వివిధ రూపాలుగా ఉంటాయి. ఇవి మూడు sets గా ఉంటాయి.
Set-1: Am, is, are, was, were
Set-2: చివర 'be' వచ్చేవి.
shall be, should be, will be, would be, can be, could be, maybe, might be, must be, have to be, has to be, had to be.
Set-3: చివర 'been' వచ్చేవి.
have been, has been, had been, should have been, would have been, could have been, might have been, must have been.
పైవన్నీ వివిధ రకాల ఉండటాన్ని తెలుపుతాయి. అన్ని verbs.
ఇప్పుడు B కింద తెలిపిన verbs చూడండి. ఇవి action words అంటే పనిని తెలిపేవి.
borrow = అరువు తీసుకోవడం (పని - action word)
gave = ఇచ్చాను/ ఇచ్చాడు/ ఇచ్చాం/ ఇచ్చారు (పని - action word).
walk = నడవడం (పని - action word).
should take = తీసుకోవాలి - (పని - - action word)
will call = (భవిష్యత్‌లో) పిలుస్తాం (పని - action word)
కాబట్టి, మనం ముఖ్యంగా తెలుసుకుని గుర్తుంచుకోవాల్సిన విషయం:
English verbs - 2types
1) Be forms = (ఉండటం అనే అర్థం వచ్చేవి)
2) Action words (పనిని తెలిపేవి).
'Be' forms:
a) Am, is are, was, were
b) చివర 'be' వచ్చే, shall be, should be, will be, would be లాంటివి.
c) చివర 'been' వచ్చే, have been, has been, had been, shall have been లాంటివి.
Actions words:
పనిని తెలిపే మాటలు: Take, give, read, go, come లాంటివి.
స్థూలంగా:
'be' forms మనం ఉండే స్థితిని చెబుతాయి.
Action words మనం చేసే పనిని తెలుపుతాయి.
మళ్లీ మళ్లీ చెబుతున్నాం - గుర్తుంచుకోండి. చూడండి.🙋♂