SPOKEN ENGLISH - 8🏵
〰〰〰〰〰〰〰〰
The 'be' forms Am/ is/ are/ was/ were తర్వాత గుణాలు తెలిపే పదాలేవైనా రావచ్చు. పరిస్థితిని తెలిపే పదాలూ రావచ్చు: Happy, sad, clever, tall, short, fat, jealous (అసూయ), beautiful, ugly, intelligent, handsome, nice, fire, ill (జబ్బుతో ఉండటం), well (కులాసాగా ఉండటం), good, bad, helpful, etc. అలాగే వ్యక్తి / వ్యక్తుల వృత్తులూ చెప్పవచ్చు.
He/she is a Teacher.
My friends are Actors.
The boy is Cricketer/ Footballer.
All the students are singers etc.,
ఇలా వీటితో వీలైనన్ని sentences practice చేయండి.
ఇలాగే questions కూడా practice చేయండి.
What are they? (వాళ్లేం ఉద్యోగం చేస్తారు?)
Where are your Friends?
How is the movie? (సినిమా ఎలా ఉంది?)
'Wh' words అంటే 'Wh' తో ప్రారంభమయ్యే మాటలు.
➤ What = ఏది?/ఏమిటి?
➤ When = ఎప్పుడు?
➤ Where = ఎక్కడ?
➤ Who = ఎవరు?
➤ Whose = ఎవరి/ఎవరిది?
➤ Why = ఎందుకు?
➤ How = ఎలా?
➤ Whom = ఎవరిని?/ఎవరికి?
➤ How well/ How good? = ఎంత బాగా?
➤ How tall? = ఎంత పొడుగు
Vocabulary అంటే తెలుసుకదా? ఒక భాషలో ఉన్న పదాల (మాటల)న్నీ.
English Vocabulary = English లోని మాటలన్నీ.
Telugu Vocabulary = తెలుగులోని మాటలన్నీ.
A person's Vocabulary = ఒక వ్యక్తికి ఒక భాషలో తెలిసిన మాటలు.
Good Vocabulary = చాలా మాటలు తెలిసి ఉండటం.
Poor Vocabulary = కొన్ని మాటలు మాత్రమే తెలిసి ఉండటం.
Now look at the basic (మౌలిక = అతి ముఖ్యమైన, Daily life లో వాడే) vocabulary చూద్దాం.
మొదట మన శరీరం, అవయవాలకు English మాటలు:
➤ తల = Head
➤ తలపై చర్మం (జుట్టుండే చోటు) = Scalp
➤ కణితలు = Right temple, left temple
➤ నుదురు/ పాలభాగం = Forehead
➤ కనుబొమ్మలు = Eyebrows
➤ కనురెప్పలు = Eye lids; singular - Eye lid
➤ కంటిరెప్ప లోపలిభాగం/ (కాటుకపెట్టే చోటు) = Eye lash
➤ కళ్లజోడు ఆనే ముక్కు పైభాగం = Nose bridge
➤ ముక్కు రంధ్రాలు = Nostrils (Right nostril, left nostril)
➤ ముక్కు కొన = Tip of the nose
➤ కమ్మలు తగిలించే చెవి భాగం = Ear lobe
➤ మీసం = Mustache (ముస్టాష్)
➤ గడ్డం/ చెంపలపై వెంట్రుకలు = Beard (బియడ్)
➤ చెంప = Cheek (Right/ Left)
➤ గడ్డం (వెంట్రుకలు లేకుండా) పంటికింది భాగం = Chin
➤ పెదవులు = Lips
➤ పళ్లు = Teeth (tooth - పన్ను)
➤ దవడ = Jaw
➤ చిగుళ్లు = Gums (upper/ lower gum)
➤ గొంతు (మింగేటప్పుడు) = throat
➤ మెడ = Neck
➤ మెడ వెనుక భాగం = Nape (నెయ్‌ప్)
➤ భుజం = Shoulder
➤ చెయ్యి = Arm
➤ హస్తం = Hand (English లో hand అంటే ముంజేతి నుంచి వేళ్ల వరకు మాత్రమే.
➤ ముంజేయి (Wrist) నుంచి భుజం వరకు, 'Arm'.
➤ పొట్ట = Stomach
➤ ఛాతీ = Chest
➤ స్త్రీల వక్షస్థలం = Breasts (ఇదెప్పుడూ breasts అని plural గానే వాడతాం)
➤ డొక్కలు = Sides
➤ వీపు = Back
➤ వెన్నెముక = Backbone/ spine
➤ నడుము = Waist
➤ Hip = నడుము చివరిపక్క (మనం చేతులు ఆన్చుకుని నిలబడేటప్పుడు, Hips మీద ఆన్చుతాం)
➤ పిరుదులు = Buttocks
➤ గజ్జలు = Groin
➤ తొడ = Thigh
➤ మోకాలు = Knee
➤ కాలు = Leg
➤ పాదం = Foot
➤ పాదం కాలుతో కలిసేచోటు = Ankle (చీలమండ)
➤ మడమ = Heel
➤ పాదం అడుగుభాగం (నేల మీద ఆనే భాగం) = Sole
➤ కాలివేళ్లన్నీ = Toe (Singular), Toes (plural) కాలిబొటనవేలు = Big toe
➤ చేతి బొటనవేలు = Thumb
➤ చూపుడు వేలు = Fore finger
➤ మధ్య వేలు = Middle finger
➤ ఉంగరపువేలు = Ring finger
➤ చిటికెన వేలు = Little finger
➤ అరచేయి = Palm
(అరచేతి రేఖలను చూసి చెప్పే జ్యోస్యం = Palmistry; అలా జ్యోస్యం చెప్పేవారు = Palmist.)
➤ గోళ్లు = Nail (s)
➤ జుట్టు = Hair
➤ ఎముక = Bone
➤ చర్మం = Skin
➤ మాంసం = Flesh
➤ నరం = Nerve
➤ కండరం = Muscle
➤ కీలు = Joint. 🙋♂