SPOKEN ENGLISH - 6🏵
〰〰〰〰〰〰〰〰
Now, in the sentences below, point out the sentences in which Telugu words for English "am, is, are, was and were" are omitted.
(కింది English sentences లో am, is, are, was, were లకు మాటలు తెలుగులోని sentences ను గుర్తించండి)
1. We are Indians.
2. Are you an actor?
3. The books are on the table
4. My friends are all in jobs.
5. Where is he?
6. Why are you here?
7. We were in Chennai yesterday?
8. His books were here an hour ago
9. The movie was good.
Answers:
1. మనం భారతీయులం - are కు ఇక్కడ తెలుగు మాట లేదు.
2. నువ్వు నటుడివా? - 'Is' కు తెలుగు లేదు.
3. పుస్తకాలు table మీద ఉన్నాయి - ఇక్కడ ఉన్నాయి = are
4. మా స్నేహితులందరూ ఉద్యోగాల్లో ఉన్నారు (ఇక్కడ ఉన్నారు = are)
5. Where is he? అతనెక్కడ? - is తో కలిపి, అతనెక్కడ ఉన్నాడు (is)? అనాలి, కానీ అతనెక్కడ? అని ఆపేస్తాం. (is = ఉన్నాడు అనేది వదిలేస్తాం)
6. Why are you here? (నువ్వెందుకున్నావిక్కడ? - are ఉన్నావు)
7. మేం నిన్న చెన్నైలో ఉన్నాం - were = (గతంలో) ఉన్నాం
8. అతడి పుస్తకాలు గంట ముందు ఇక్కడ ఉన్నాయి. were = (గతంలో) ఉన్నాయి.
9. ఆ సినిమా బాగుంది (was = ఉంది)
మనం నేర్చుకున్న విషయం: తెలుగులోలా Englishలో, ఉన్నాయి, ఉంది, ఉన్నాం etc తెలిపే verbను వదిలేయడానికి వీల్లేదు.
ప్రతి English sentenceలో verb ముఖ్యం.
ఈ verbను గురించి తెలుసుకోండి:
Am/ is/ are = ఉండటం - ఇప్పుడు (Now), ఎప్పుడూ (always), క్రమం తప్పకుండా (Regularly).
I am
he is, She is, It is
we are, you are, they are
అంటే am ఎప్పుడూ I తో, is ఎప్పుడూ He, she, it తో, are ఎప్పుడూ we, you, they తో వాడతాం. ఇప్పుడూ, ఎప్పుడూ, క్రమం తప్పకుండా 'ఉండటం' అనే అర్థంతో.
అలాగే was/were = past (గతంలో) ఉండటం.
I/ he/ she/ it - was
we/ you/ they - were
అంటే plural number కు were వాడతాం.
(am, is, are, was, were - ఈ verbs 'be' forms (ఉండటం - వివిధ కాలాల్లో అని అర్థం వచ్చే verb) లో కొన్ని ఇప్పుడు చూడండి:
a) I am at home (నేనింట్లో ఉన్నాను -ఇప్పుడు)
I am at home on Sundays [అన్ని ఆదివారాలు/ ప్రతి ఆదివారం నేనింట్లోనే ఉంటాను. (Regular)].
b) The Sun (it) is in the East in the mornings [ప్రతి ఉదయం సూర్యుడు తూర్పున ఉంటాడు. (Regular)].
c) My friend (he/ she) is at home.
(మా స్నేహితుడు/ స్నేహితురాలు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు/ ఉంది.)
d) The students are in class.
విద్యార్థులు class లో ఉన్నారు (ఇప్పుడు).
e) India was under British rule till 1947.
[1947 వరకు భారత్ బ్రిటిష్ పరిపాలనలో ఉండేది (గతం)].
f) The British were our rulers until 1947.
(1947 వరకు British వాళ్లు మన పాలకులుగా ఉండేవాళ్లు - గతం. British వాళ్లు, plural కాబట్టి, were)
g) I am not in Vijayawada
నేను విజయవాడలో లేను (ఇప్పుడు).
h) Am I your enemy?
నేను నీ శత్రువునా? Question కాబట్టి Am (verb) తర్వాత I (subject) వస్తుంది కదా?)
i) She is not a student
(ఆమె విద్యార్థిని కాదు)
j) Is she not a student?
(ఆమె విద్యార్థిని కాదా?)
ఇక్కడ కూడా question కాబట్టి is (verb) తర్వాత she (subject).
k) Your books are not here.
(నీ పుస్తకాలిక్కడ లేవు - ఇప్పుడు)
l) Where are your clothes?
(నీ దుస్తులెక్కడ ఉన్నాయి? - ఇప్పుడు) 🙋♂