SPOKEN ENGLISH - 5🏵
〰〰〰〰〰〰〰〰
Verb లేనిదే Sentence ఉండదు.
Mukund: I am happy today. The books are here. This book with the green cover is more interesting than the other two books.
(ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాలు ఇక్కడున్నాయి. పచ్చ అట్టతో ఉన్న ఈ పుస్తకం మిగతా రెండింటి కంటే ఆసక్తికరంగా ఉంది.)
Govind: Yes. I have read it. It is about Einstein, the great scientist. It is a biography but is more like a story.
(అవును. నేను దాన్ని చదివాను. అది ఐన్‌స్టైన్ అనే గొప్ప శాస్త్రవేత్తను గురించి. అది జీవితచరిత్రే. కానీ అదో కథలా ఉంది.)
Mukund: I am an admirer of Einstein and so are you, I think. Einstein himself was a great admirer of Gandhi. The two were really great men. (నేను ఐన్‌స్టైన్ అభిమానిని. నువ్వు కూడా అనుకుంటా. ఐన్‌స్టైన్ గాంధీ అభిమాని. ఆ ఇద్దరూ చాలా గొప్ప వాళ్లు).
Admire = మెచ్చుకోవడం, అభిమానించడం.
Admirer = అభిమాని = fan
Govind: Most people are full of respect for the two. They were such geniuses.
(చాలామందికి ఆ ఇద్దరంటే అభిమానం. అలాంటి మేధావులు వాళ్లు).
Mukund: Einstein is famous for his scientific discoveries. Gandhi is famous for his discovery of peace and non-violence as a weapon against Britishers.
(సైన్స్‌లో కొత్త విషయాలు కనుక్కుని ఐన్‌స్టైన్ ప్రసిద్ధికెక్కాడు. అలాగే గాంధీ కూడా బ్రిటిషర్లను అంతమొందించేందుకు శాంతి, అహింస అనే ఆయుధాలు కనిపెట్టి ప్రసిద్ధికెక్కాడు.)
famous = ప్రసిద్ధి చెందిన/ పేరున్న
fame = ఖ్యాతి/ ప్రసిద్ధి
Violence = హింస / దౌర్జన్యం
Non-violence = అహింస
Govind: That's why the world is grateful to them.
(అందుకే ప్రపంచం వాళ్లకెప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది.)
greatful = కృతజ్ఞత ఉన్న
★★★★★★★★★★★
తెలుగు వాక్యంలో word order (ఏ మాట ముందు, ఏ మాట తర్వాత అనేది) కు, English sentence లో word order కూ చాలా తేడా ఉంటుందని కిందటి lesson లో చూశాం కదా?
తెలుగు వాక్యంలో సామాన్యంగా ఏ మాటను ఎటు మార్చినా అర్థం మారదు.
eg: గోవింద్ పామును చంపాడు.
ఈ వాక్యంలో మాటల position ను ఎటు మార్చినా అదే అర్థం వస్తుంది.
చూడండి.
పామును గోవింద్ చంపాడు
చంపాడు పామును గోవింద్
గోవింద్ చంపాడు పామును.
ఇలా ఏ మాట ఎక్కడున్నా వాక్యం అర్థం మారదు. కానీ English లో అలాకాదు. ఉన్నచోటి నుంచి మాటను మారిస్తే అర్థం మారిపోతుంది.
చూడండి:
Govind killed a snake = గోవింద్ పామును చంపాడు
A snake killed Govind = పాము గోవింద్‌ను చంపింది.
చూశారు కదా? ఎంత తేడా ఉందో. అందుకే English లో word order in a sentence is very important.
Second Point:
English లో statement (ఏదైనా ఒక విషయం చెప్పే sentence) కూ, Question (ప్రశ్న) కూ word order లో చాలా తేడా ఉంటుంది.
Statement: He (Subject) is (Verb) here (అతనిక్కడ ఉన్నాడు.) [Subject + Verb]
అంటే statement లో ఎప్పుడూ subject ముందు, దాని తర్వాత verb వస్తాయి.
Question: Is (Verb) he (Subject) here? (అతడిక్కడ ఉన్నాడా?) [Verb + Subject]
ఇది ఇంతకు ముందు lesson లో చూశాం కదా?
ఇప్పుడిది గమనించండి:
English లో verb చాలా ముఖ్యం. తెలుగులో చాలావరకు verb అంతగా వాడం.
look at the following.
Ram is Mukund's friend.
అర్థం: రామ్, ముకుంద్ స్నేహితుడు.
Ram is Mukund's friend అనడంలో, Ram subject, is verb కదా?
తెలుగు వాక్యంలో చూడండి: Ram కు, రాం అని ఉంది, Mukund's friend కు ముకుంద్ స్నేహితుడు అని ఉంది. కానీ English లోని is (verb) కు తెలుగులో ఏ మాటాలేదు కదా! ఇలా తెలుగులో verb ను మనం అంతగా పట్టించుకోం .
'రాం, ముకుంద్ స్నేహితుడు' అంటామే కానీ రాం, ముకుంద్ స్నేహితుడిగా ఉన్నాడు (= is) అనం.
Dasaradha is Sri Rama's father.
(దశరథుడు శ్రీరాముడి తండ్రి) (is = ఉన్నాడు) తెలుగులో 'is' కు ప్రాముఖ్యం ఇవ్వం. కానీ ఇంగ్లిష్‌లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. verb లేనిదే sentence ఉండదు.
Now, look at the following sentences from the conversation (సంభాషణ) at the beginning of the lesson.
1) The books are here.
2) It is about Einstein.
3) I am an admirer of Einstein.
4) It is a biography, but it is more like a story.
5) I am an admirer of Einstein.
6) Einstein himself was an admirer of Gandhi.
7) The two were really great men.
The words am, is, are, was and were, underlined above are all verbs.
1) The books are here = పుస్తకాలిక్కడ ఉన్నాయి.
2) It is about Einstein = అది ఐన్‌స్టైన్ ను గురించి.
చూశారా తెలుగులో Einstein ను గురించి, అని వదిలేస్తాం. కానీ English sentence లో is అనే verb లేకపోతే తప్పు. అలాగే
3) I am an admirer of Einstein = నేను ఐన్‌స్టైన్ అభిమానిని - ఇక్కడ కూడా English లో am (ఉన్నాను) కు తెలుగు లేదు.
4) It is a biography, but it is more like a story.
అది జీవిత చరిత్రే. (is తెలుగులో = ఉంది. తెలుగులో వాడం) కానీ కథలా ఉంది. (is)
5) I am an admirer of Einstein = నేను ఐన్‌స్టైన్ అభిమానిని - అంటే చాలు. am కు కూడా తెలుగు చెప్తే, గా ఉన్నాను అనాలి. కానీ అలా అనం కదా.
6) Einstein was an admirer of Gandhi = ఐన్‌స్టైన్ గాంధీ అభిమాని. (గా ఉండేవాడు = was)
7) The two were really great = ఆ ఇద్దరూ నిజంగా గొప్పవాళ్లు (గా ఉండేవాళ్లు = were)
ఇంకో విషయం. English లో verb ఎప్పుడూ, subject వెంటే ఉంటుంది. తెలుగులో ఎక్కడ ఉన్నా ఫరవాలేదు. కానీ ఎక్కువగా వాక్యం చివర వస్తుంది. 🙋♂