SPOKEN ENGLISH - 4🏵
〰〰〰〰〰〰〰〰
✳EXERCISE
Now, ask questions to get the following answers: (for YES/NO answers, the question is a 'non-wh' question, and for statements, it is 'wh' question)
Q-1: -----?
A: Yes, his friends are here
Q-2: -----?
A: They are coming tomorrow
Q-3: -----?
A: No, Shyam was not here yesterday
Q-4: -----?
A: Yes, Mr. Kiran Kumar Reddy is the CM of A.P.
Q-5: -----?
A: Hyderabad is in Andhra Pradesh
Q-6: -----?
A: My friend was here yesterday.
Answers to the exercise above.
Answer 1, Yes తో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది 'Non-Wh' Question.
Q-1: Are his friends here? (Non-Wh)
Answer 2 లో Yes/No లేదు కాబట్టి, ఇది 'Wh' question కావాలి.
Q: Who are coming tomorrow? / When are they coming? (Yes/No లేకుండా వచ్చే answer, ఒకటి కంటే, ఎక్కువ questions కు answer కావచ్చు)
Q-3: Was Shyam here yesterday?
Q-4: Is Mr. Kiran Kumar Reddy the CM of AP?
Q-5: Where is Hyderabad?
Q-6: Who was here yesterday? / When was your friend here?
ఇలా వీలైనన్ని questions మీ friends, brothers and sisters తో practise చేయండి. ఇది చాలా అవసరం.
Q. What was he doing there?
ఈ question లో, was, HV; doing-MV.
కదా. దీనికి జవాబు చూడండి.
He was reading a book.
Spoken English నేర్చుకోవడానికి, అంటే English లో ధారాళంగా మాట్లాడాలంటే మీరు చేయాల్సింది: verb conjugation తెలుసుకోవడం. అంటే verb కు, past tense, past participle తెలుసుకోవడం. ఇవి కిందివిధంగా ఉంటాయి.
Present tense -- Past tense -- Past participle
➤ go -- went -- gone
➤ come -- came -- come
➤ sing -- sang -- sung
➤ write -- wrote -- written
➤ give -- gave -- given
➤ talk -- talked -- talked
➤ like -- liked - liked
➤ smell -- smelt -- smelt
ఈ conjugation తెలిసి ఉండటం చాలా అవసరం. చాలా verbs, past tense, past participle, +ed చేర్చి (Talk, talked, talked) లేదా +d చేర్చి (like, liked, liked) లేదా +t చేర్చి (smell, smelt, smelt) form చేస్తాం.
కొన్ని verbs కు మాత్రం (give, gave, given)
ఒక పద్ధతి లేకుండా (irregular గా) form అవుతాయి. వీటిని నేర్చుకోవడం ముఖ్యం.
ఇవి ఏ grammar book/Oxford, Cambridge, Longman's Dictionaries లో అయినా దొరుకుతాయి. కంఠస్థం చేయండి.
ఇప్పుడు మనం daily life లో ఎక్కువగా వాడే కొన్ని మాటలు (vocabulary) చూద్దాం.
Parts of the human body
Head, face, eyes, ears, neck, nose, shoulders, fingers, legs లాంటి మాటలు అందరికీ తెలుసు.
ఇవి చూడండి.
➤ forehead = నుదురు,
➤ eyelids = కనురెప్పలు;
➤ eyebrows = కనుబొమ్మలు;
➤ eyelash = కనురెప్ప లోపలి భాగం;
➤ nose bridge = ముక్కుమీద కళ్లజోడు ఆనేచోటు;
➤ right nostril, left nostril = ముక్కు రంధ్రాలు.
➤ gums = పంటి చిగుళ్లు;
➤ jaw = దవడ
➤ ear lobe = చెవులకు కమ్మలు, రింగులు తగిలించే భాగం
➤ chin = గడ్డం (వెంట్రుకలు లేని);
➤ ribs = పక్క ఎముకలు
➤ spine/backbone = వెన్నెముక;
➤ hand = అంటే హస్తం మాత్రమే;
➤ wrist = మణికట్టు;
➤ arm = మణికట్టు నుంచి భుజాల వరకు ఉండే చేయి.
➤ elbow = మోచేయి;
➤ forefinger = చూపుడు వేలు;
➤ little finger = చిటికెనవేలు;
➤ thumb = బొటనవేలు ;
➤ stomach = కడుపు/ పొట్ట.
➤ waist = నడుము.
➤ backside = buttocks = పిరుదులు.
➤ lap = ఒడి;
➤ knee = మోకాలు;
➤ shin = కాలిముందరి భాగం;
➤ calf = కాలి వెనుక భాగం;
➤ ankle = కాలికి పాదానికీ మధ్య కీలు (చీలమండ);
➤ toes = కాలివేళ్లు;
➤ big toe = కాలిబొటనవేలు.
➤ heel = మడమ.
➤ sole = పాదం అడుగు భాగం,
➤ instep = పాదంపైభాగం.