SPOKEN ENGLISH - 2
〰〰〰〰〰〰〰〰
ఇప్పుడు ఈ lesson ప్రారంభంలో ఇచ్చిన కింది Sentences ను గమనించండి.
1) These mangoes are tasty.
2) Are they for me...?
3) Where is dad?
4) How sweet this mango is!
పైవన్నీ sentences, ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కటీ పూర్తి అర్థాన్నిచ్చే మాటల కూర్పు కాబట్టి -
A sentence is a group of words with complete meaning.
చూడండి:
1. These mangoes are tasty.
( ఈ మామిడి పండ్లు రుచిగా ఉన్నాయి )
అర్థం పూర్తయింది కాబట్టి sentence.
2. Are they for me...?
( అవి నాకా? )
ఇది కూడా sentence, అర్థం పూర్తయింది కాబట్టి.
అలాగే 3rd and 4th group of words కూడా, sentence అవుతాయి.
ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి:
1st sentence, 'These mangoes' ను గురించి చెబుతోంది. అంటే 'These mangoes' మొదటి sentence కు SUBJECT. అలాగే.
2nd sentence, Are they for me?
'They'ను గురించి చెప్పడం వల్ల, They, second sentence కు subject. ఆ కారణంగానే 3rd sentence, 'dad' and the subject of the 4th sentence is 'Mango'.
అంటే sentence దేన్ని గురించి చెబుతుందో అది దాని SUBJECT. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడిది చూడండి. Sachin plays cricket.
★★★★★★★★★★★
ఈ sentence కు subject Sachin, sentence Sachin ను గురించి చెబుతోంది కాబట్టి. ఈ sentence లో Sachin (subject) తర్వాత ఏ మాట ముఖ్యమో చూడండి. Plays ముఖ్యం కదా? ఎందుకంటే 'Plays' లేకపోతే, sentence లేదు. (Sachin cricket - అర్థం లేదు). అంటే Sachin తర్వాత 'Plays' అనేది sentenceకు ముఖ్యం; కాబట్టి Plays ఈ sentence లో verb.
The boys are playing cricket.
ఇక్కడ verb ఏమిటో చూద్దాం. Subject: The boys. అది తీసేస్తే, sentence కు ముఖ్యమైన మాట (లు) ఏది (వి)?
Playing తీసేస్తే, The boys are cricket - అర్థం లేదు, కాబట్టి sentence కాదు. కాబట్టి 'Playing' verb అవుతుంది. 'are' తీస్తే sentence ఉంటుందా?
They playing cricket.
వాళ్లు cricket ఆడుతూ - అర్థం పూర్తి కాలేదు, కాబట్టి sentence కాదు.
కాబట్టి The Boys are playing cricket లో verb: are playing. కాబట్టి
VERB: sentence లో subject తర్వాత, ఏమాట/మాటలను తీసేస్తే sentence ఉండదో అది verb అవుతుంది. ఇది చాలా ముఖ్యం.
VERB లో ఒక మాట అయినా ఉండొచ్చు; ఒకటి కంటే ఎక్కువ మాటలు (second sentence లో 'are playing' లా) ఉండొచ్చు.
She is not coming to the movie.
Subject- She
Verb- is coming (not- verbలో భాగంకాదు కదా?)
అంటే verb లోని అన్ని మాటలూ ఒకేచోట ఉండాలని లేదు.
ఇప్పుడు మీరు కింది sentences లో subject, verb గుర్తించండి.
1) She knows English.
2) He is not going out today.
3) Where are you working now?
4) How well she sings!
5) Are you coming to the movie?
6) Am I not helping you?
7) What he says is not correct.
8) She has been studying here for the past three years.
9) Why were you standing there?
10) How tall the boy is!
ANSWERS
SUBJECT -- VERB
➤ she -- knows
➤ he -- is going
➤ you -- are working
➤ she -- sings
➤ you -- are coming
➤ I -- am helping
➤ he -- is
➤ she -- has been studying
➤ you -- were standing
➤ the -- boy is
senteceలో Subject, Verb లను గుర్తించడం చాలా చాలా ముఖ్యం.
Subject, verb లను సరిగ్గా గుర్తించగలిగితే English మాట్లాడటం చాలా తేలికవుతుంది. కాబట్టి sentence ను చూడగానే, దాని subject, verb ఏవో చెప్పగలగాలి. దీనివల్ల అన్నీ మనకు సులభమవుతాయి.
★★★★★★★★★★★
తెలుగుకూ English కూ ముఖ్యమైన తేడా:
తెలుగులో మాటల వరస (Order of words in a sentence)
ఏ మాట ముందూ, ఏ మాట తర్వాత అనే విషయానికి అంత ప్రాముఖ్యంలేదు.
వాక్యంలోని మాటలను ముందూ వెనుకా చేసినా అర్థం మారదు.
జానకి ఆ పుస్తకాన్ని కొన్నది.
ఆ పుస్తకాన్ని జానకి కొన్నది.
కొన్నది ఆ పుస్తకాన్ని జానకి.
Sentence లోని words ఎక్కడికి మార్చినా అర్థం మారదు. అదే English లో ప్రయత్నిద్దాం.
a) Janaki bought a book.
ఇందులో మాటల వరస మార్చండి.
b) A book bought Janaki
a) కి అర్థం 'జానకి పుస్తకాన్ని కొన్నది' అని కదా? అయితే
b) కి అర్థం. పుస్తకం జానకిని కొన్నది. "
అలాగే Rama killed Ravana, Ravana killed Rama కి అర్థంలో చాలా తేడా ఉంది కదా? రెండోది, మొదటిదానికి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది English sentenceలో మాటల క్రమం (word order) చాలా ముఖ్యం అని కదా. ముందు ఇది పరిశీలించి అర్థం చేసుకుంటే మన English correct గా ఉంటుంది.