*EXERCISE*
*Practise the following aloud in English.*
Kundan: నువ్వు సాయంత్రం పూట ఇంట్లో ఉంటావా?
Lalith: లేదు. నేను సాయంత్రం పూట ఇంట్లో ఉండను. లైబ్రరీలో ఉంటాను.
Kundan: మరి ఇప్పుడు సాయంత్రం కదా! ఇంట్లోనే ఉన్నావు? (But it తో ప్రారంభించండి)
Lalith: ఈరోజు శుక్రవారం. శుక్రవారం లైబ్రరీకి సెలవు. అందువల్ల ఇంట్లోనే ఉన్నాను.
Kundan: అది మంచి లైబ్రరీయేనా?
(ఇది Question కదా! అందువల్ల ముందు verb, తర్వాత subject రావాలి)
Lalith: అది చాలా పెద్ద లైబ్రరీ. (It isతో ప్రారంభించండి). అక్కడ చాలా పుస్తకాలూ, అన్ని పత్రికలూ ఉంటాయి.
Kundan: ఆ లైబ్రరీ ఎప్పుడు తెరిచి ఉంటుంది?(Whenతో ప్రారంభించండి)
Lalith: పొద్దున తొమ్మిది నుంచి రాత్రి 8 వరకు.
(AM/ PM వాడకండి. అవి గ్రాంథికం. మామూలు Spoken English లో Morning/ Evening వాడతాం).
*ANSWERS*
Kundan: Are you at home in the evenings?
(Evenings - Regular State of Being)
Lalith: No. I am not at home in the evenings. I am in the library.
Kundan: But it is evening now. You are at home.
Lalith: Today is Friday. Friday is a holiday for the library.
Kundan: Is it a good library?
Lalith: It is a big library. There are many books and all newspapers and magazines.
Kundan: When is the library open?
Lalith: From morning 9 to/ till 8 in the evening.
Am/ is/ are - ఇవి "be" forms - They talk of regular/ present states of being. అంటే 'ఎప్పుడూ ఉండటం/ ప్రస్తుతం ఉండటం గురించి తెలియజేస్తాయి.
a) I am here at this time every day (Am - Regular State of being/ క్రమం తప్పకుండా ఉండటం).
b) I am at the Railway Station (నేను రైల్వేస్టేషన్లో ఉన్నాను - ప్రస్తుతం)
c) I am in Vijayawada (నేను విజయవాడలో ఉంటాను - ఎప్పుడూ/ నేనుండేది విజయవాడలో)
d) He is at the office from 10 to 5.
(అతడు 10 నుంచి 5 వరకూ Officeలో ఉంటాడు. is - Regular)
e) He is at home. (is - now - ప్రస్తుతం)
f) He is a teacher. (అతడు teacher - వృత్తి కాబట్టి ఎల్లప్పుడూ)
g) Where are the students? (విద్యార్థులు ఎక్కడ ఉన్నారు? - are - ప్రస్తుతం)
h) The boys are not here in the evenings.
(సాయంత్రం వేళల్లో ఆ పిల్లలు ఇక్కడ ఉండరు - ఉండక పోవడం Regular)
i) The classes are at 10 everyday.
So these are the uses of the ''be'' forms "am/ is/ are".
Now, look at the following...
Was, Were: ఇవి "be" forms. అంటే ఇవి కూడా ఉండటాన్ని గురించే తెలియజేస్తాయి - అయితే ఇవి గతం (Past) లో ఉన్న States of being ను గురించి చెబుతాయి.
India was under British rule.
భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది/ ఉండేది (Past)
We were under British rule till 1947.
(మనం 1947 వరకూ బ్రిటిష్ పాలనలో ఉండేవాళ్లం/ ఉన్నాం.)
I, he, she, it (Singular) తో was వాడతాం.
We, you, they (Plural) తో were వాడతాం.
You = నువ్వు (Singular)/ You = మీరు (Plural) అర్థం ఏదైనా, Youతో were మాత్రమే వాడతాం.
a) I was a student at that College.
(నేను ఒకప్పుడు ఆ కళాశాల విద్యార్థిగా ఉన్నాను - Past)
b) Nehru was the first Prime Minister of India.
(భారత మొదటి ప్రధానిగా నెహ్రూ ఉండేవారు/ ఉన్నారు.)
c) When was he here yesterday?
(అతడు నిన్న ఇక్కడ ఏ సమయంలో ఉన్నాడు? - Past)
d) Where were you last night?
(నిన్న రాత్రి ఎక్కడున్నావు? - Past - were)
e) We were members of that club till last month = కిందటి నెల వరకు, మేం ఆ క్లబ్ సభ్యులుగా ఉన్నాం - (Past)
f) The students of last year were all good = కిందటి సంవత్సరం విద్యార్థులందరూ మంచివాళ్లు - were - (Past)
★★★★★Next Lesson Tomorrow★★★★★