Am / is / are = be forms
Anirudh: Where is your brother?
(మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?)
Aravind: He is in Mumbai. But why ask now?
(అతడు ముంబయిలో ఉన్నాడు. అయితే ఇప్పుడెందుకు అడుగుతున్నావు?)
Anirudh: Two of my uncles are there.
(మా బాబాయిలు ఇద్దరు అక్కడ ఉన్నారు)
Aravind: Where exactly are they?
(ముంబయిలో కచ్చితంగా ఎక్కడున్నారు?)
Anirudh: One is in Andheri and the other is in Matunga. I am happy to tell you they are settled there.
(ఒకాయన అంధేరిలో, ఇంకో ఆయన మతుంగాలో ఉన్నారు. వాళ్లు అక్కడే స్థిరపడ్డారని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది.)
Aravind: I am familiar with Mumbai. I was there for three months last summer.
(నాకు ముంబయి బాగా తెలుసు. గత వేసవిలో నేనక్కడ మూడు నెలలు ఉన్నాను.)
Anirudh: Why were you there?
(నువ్వెందుకు అక్కడ ఉన్నావు?)
Aravind: My mother and I were there for some treatment for my mother; my brother was too busy.
(అమ్మ వైద్యం కోసం నేనూ అమ్మా అక్కడికి వెళ్లాం. మా సోదరుడు తీరిక లేకుండా ఉన్నాడు.)
Anirudh: How is your mother now?
(మీ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది?)
Aravind: She is all right.
(ఆమె బాగానే ఉంది.)
Anirudh: I am happy to know that.
(ఆమె బాగున్నందుకు సంతోషంగా ఉంది.)
Look at the following sentences:
1) I am happy to know that.
2) Where is your brother?
3) Two of my uncles are in Mumbai.
Am, is, are verbs కదా! Am ను I తో, is ను he, she, it (అతడు, ఆమె, అది లాంటి subjects) తో, are ను, we (మేం/ మనం), you (నువ్వు/ మీరు), they (వారు/ అవి)తో వాడతాం.
అయితే am, is, are లకు సరైన అర్థం తెలుసుకోవడం అవసరం. ఇవన్నీ 'ఉండటం' (Being)ను తెలుపుతాయి. 'ఉండటం ప్రస్తుతం', 'క్రమం తప్పకుండా ఎప్పుడూ ఉండటం' (Being Regular) లాంటి వాటిని తెలిపేందుకు am/ is/ are ను వాడతాం.
We use am/ is/ are for present states of being and regular states of being.
('ప్రస్తుతమున్న స్థితి, క్రమం తప్పకుండా ఉండే స్థితుల గురించి తెలపడానికి am/ is /are ను వాడతాం.)
Being = ఉండటం,
State = స్థితి
Study the following:
Sumanth: Where are you?
(నువ్వు ఎక్కడ ఉన్నావు? - ప్రస్తుతం)
Nishanth: I am at home.
(నేను ఇంట్లో ఉన్నాను - ఇప్పుడు)
Sumanth: But you are usually at college at this time every day.
(కానీ నువ్వు మామూలుగా రోజూ ఈ సమయంలో కాలేజీలో ఉంటావు కదా!)
(Usually = మామూలుగా)
Nishanth: I am, but today I am ill.
(అవును, కానీ ఈరోజు నేను జబ్బుగా ఉన్నాను.)
Sumanth: Is your brother at home?
(మీ అన్న ఇంట్లో ఉన్నాడా? - ప్రస్తుతం)
Nishanth: No, he is at the office. You know he is at the office at this time every day.
(లేడు, ఆఫీస్‌లో ఉన్నాడు. అతడు రోజూ ఈ సమయంలో ఆఫీసులో ఉంటాడని నీకు తెలుసు కదా!)
పై సంభాషణ జాగ్రత్తగా గమనించండి.
1. a) I am at home - ప్రస్తుతం నేను ఇంట్లో ఉన్నాను.
b) I am at college at this time every day - రోజూ ఈ సమయంలో కాలేజీలో ఉంటాను.
2. a) Where are you? (ఎక్కడ ఉన్నావు? - ప్రస్తుతం)
b) You are usually at college at this time every day.
నువ్వు రోజూ ఈ సమయంలో కాలేజీలో ఉంటావు - Regular
3. a) Is your brother at home?
మీ అన్నయ్య ఇంట్లో ఉన్నారా? - ప్రస్తుతం (Present)
b) He is at the office at this time every day.
రోజూ ఈ సమయంలో ఆయన ఆఫీసులో ఉంటాడు. (Regular)
c) A pen is in his pocket - అతడి జేబులో పెన్ ఉంది - ప్రస్తుతం (present/ now)
d) A pen is always there in his pocket.
అతడి జేబులో ఎప్పుడూ పెన్ ఉంటుంది. (Regular)
గమనించాల్సిన విషయం
(I) am
(He, she, it) is
(We, you, they) are
1. ప్రస్తుతం ఉండటం (Present state of being)
2. క్రమం తప్పకుండా/ ఎప్పుడూ ఉండటం (Regular state of being/ state of being always) 🙋♂
★★★★★Next Lesson Tomorrow★★★★★