e.g.: 1) Is he a good player? ('Non-wh' question)
Ans: Yes/No
e.g.:: 2) Where are you going? ('wh' question)
Ans I am going home (statement).
* పై విషయాన్ని గుర్తుంచుకుని, కింది answers వచ్చేలా questions వేయండి.
e.g.: కింది ఉదాహరణలు గమనించండి.
Yes, Hyderabad is a big city?
1) ఈ answer, 'yes'తో ప్రారంభం అవుతోంది కదా? కాబట్టి ఇది, 'Non-wh' question కు answer.
ఆ question.
Is Hyderabad a big city?
2) No, he was not here yesterday.
ఈ answer వచ్చే question కూడా, 'Non-wh' question అవుతుంది. 'No' తో మొదలవుతోంది కాబట్టి.
ఆ question:
Was he here yesterday?
3) Srikanth was here last night. ఈ answer, statement. కాబట్టి ఇది answer గా ఉండే question, 'wh' question. ఆ question:
a) When was Srikanth here?
b) Where was Srikanth here?
c) Who was here yesterday?
ముఖ్య విషయం: Statement answer అయితే, అదే statement, పై ఉదాహరణలోలా, ఒక 'wh' question కే కాకుండా, రెండు మూడు 'wh' questions కు answer కావచ్చు. ఇది కూడా చూడండి.
4) Sita is studying science.
ఇది కూడా statement కాబట్టి, ఇది answer గా వచ్చే question కూడా 'wh' question అవుతుంది. అది
a) Who is studying?
b) What is Sita doing?
c) What is Sita studying?
పై విషయాలను గుర్తుంచుకుని, కింది answers వచ్చేలా, questions వేయండి.
1) Yes, Ramu is my friend.
2) Surendra will be here tomorrow.
3) Karim is playing cricket.
4) No, he cannot sing.
5) Girija is singing beautifully.
6) He was wasting money.
7) Tarun is not on the team because he is ill.
8) Yes, he can run faster than his brother.
9) Surekha's father is a landlord.
10) Sachin is a great cricketer.
(ఇది చాలా ముఖ్యమైన exercise. Answers ను గమనించి questions అడగండి. రాయడమే కాకుండా, బిగ్గరగా practice చేయండి. మనం questions అడిగే తీరుని బట్టి మనకే మాత్రం English వచ్చనేది తెలుసుకోవచ్చు)
మీ answers ను కింద ఇచ్చిన answers తో సరిచూసుకోండి.
1) Is Ramu your friend?
2) ఇది statement కదా? కాబట్టి ఇది answer గా ఉండే questions, రెండు, మూడు ఉండొచ్చు.
a) Who will be here tomorrow?
b) When will Surendra be here?
c) Where will Surendra be tomorrow?
3) ఇది కూడా statement, కాబట్టి it is an answer to more than questions.
a) Who is playing cricket?
b) What is Karim playing?
c) What is Karim doing?
4) Can he sing? (Answer is 'No' - so, it is an answer to a 'Non-wh' question)
5) a) Who is singing beautifully?
b) How is Girija singing?
c) What is Girija doing?
6) a) What was he doing?
b) What was he wasting?
c) Who was wasting money?
7) a) Why is Tarun not on the team?
b) Who is not on the team and why?
8) Can he run faster than his brother?
9) a) Who is a landlord?
b) Whose father is a landlord?
c) What is Surekha's father?
(Englishలో ఎవరైనా ఏ ఉద్యోగం చేస్తారనే అర్థంతో, వాళ్లేం చేస్తారు? అని అడగడానికి, what is he/ she doing? అనరు.
What is he/ she? అంటారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. 'లేదంటే what does he/ she do (for a living)? అంటాం. అయితే ఇది కొంచెం తక్కువ)
10) a) Who is a great cricketer?
b) What kind of cricketer is Sachin?
* ఇప్పుడు ఈ questions ను English లో అడగండి.
1) అతడిక్కడున్నాడా (ఇప్పుడు)?
2) సుశీల బాగా పాడగలదా? (can తో ప్రారంభించండి) (can = గల)
3) రహీం రేపొస్తాడా ఇక్కడికి? (will రేపు (future) కాబట్టి)
4) నేను చెయ్యాలా అది? (must/ have to/ should వాడండి)
5) సునీల్ ఎప్పుడొస్తాడిక్కడికి? (will-future కాబట్టి)
6) ఆ రోజుల్లో అతడు బాగా పాడగలిగేవాడు (గతంలో సామర్థ్యం (గలిగాడు) కాబట్టి could వాడండి)
7) అవెక్కడ దొరుకుతాయి? (will, available వాడండి)
8) అక్కడ ఎన్ని పుస్తకాలున్నాయి? (How many .... తో ప్రారంభించండి)
9) ఆ ప్రదర్శన ఎప్పుడు? (When తో ప్రారంభిస్తాం కదా?)
10) నిన్న శంకర్ ఎందుకున్నాడు అక్కడ ?
ఈ Answers తో సరిచూసుకోండి. (ఈ questions అన్నీ రాయడం కంటే కూడా బిగ్గరగా practice చేయడం ముఖ్యం).
Answers:
1) Is he here now?
2) Can Suseela sing well?
3) Will Rahim come here tomorrow?
4) Should I/ must I/ Have I to do it?
5) When will Sunil come here?
6) He could sing well those days.
7) Where are/ will they be available?
8) How many books are there?
9) When is the show?
10) Why was Sankar there yesterday? 🙋♂
★★★★★Next Lesson Tomorrow★★★★★