*Verb + Subject Order = Question*
Chandan: Is Harish a good player?
(హరీష్ మంచి ఆటగాడేనా?)
Chethan: He is, of course.
(కచ్చితంగా)
Chandan: Was he your classmate?
(అతడు నీ క్లాస్‌మేటా?)
Chethan: Yes, he was.
(అవును)
Chandan: How long has he been here?
(ఎంతకాలంగా ఉన్నాడిక్కడతను?)
Chethan: For the past two months.
(రెండు నెలలుగా).
Chandan: Are you his relative?
(నువ్వు అతడికి బంధువా?)
Chethan: No. I am not. But we are close friends. But why are you eager to know all this?
(కాదు. కానీ మేం మంచి స్నేహితులం. కానీ ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నావు?)
Chandan: I like his game very much. The way he handles the ball and the way he passes are all impressive.
(అతడి ఆట తీరు నాకు నచ్చింది. అతడు బంతి వాడే విధానం, దాన్ని అందించే తీరు నిజంగా గొప్ప అభిప్రాయాన్ని కలిగిస్తుంది.)
Chethan: You are a player yourself. You must know. Are you interested in meeting him?
(నువ్వూ ఆటగాడివే కదా. నీకూ తెలియాలవన్నీ. అతడిని కలుసుకోవాలనుందా నీకు?)
Chandan: I am.
(అవును)
పై సంభాషణలోని questions చూడండి. మళ్లీ ఒకసారి ఆంగ్లంలో questions అడిగే తీరు గుర్తు చేసుకుందాం. మామూలు statement అయితే, sub + verb order ఉంటుంది కదా? అదే question అయితే, verb + subject order, అంటే, questionలో ఎప్పుడూ verb ముందూ, ఆ తర్వాత subject వస్తుందనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం.
పై సంభాషణలో questions చూడండి.
1) Is Harish a good player?
Is (verb) + Harish(subject)...
2) Was he your classmate?
was (verb) + he (subject) ...
3) How long has he been here?
ఇది 'Wh' question, అంటే, 'why, when, what, where, which, who, whose and how' - వీటిల్లో దేంతోనైనా ప్రారంభమయ్యే ప్రశ్న. ఎలాంటి question అయినా, ఎప్పుడూ, subject ముందు verb వస్తోంది కదా?
4) Are you his relative?
5) Why are you eager to know all this?
ఇదీ 'Wh' question కదా? ఇందులో కూడా are (verb) + you (sub) రావడం గమనించండి.
6) Are you interested...?
ఇది కూడా Are (verb) + you (sub) order ఉన్న question.
'wh' question లో కానీ 'non -wh' question లో కానీ subject ఎప్పుడూ verb తర్వాత గానీ helping verb తర్వాత గానే వస్తుంది.
NOW LOOK AT THE FOLLOWING QUESTIONS:
Is he coming?
ఈ question లో subject, 'he'; verb: is coming.
This verb has two words in it:
1) is 2) coming.
మనం ఇంతకు ముందు చూశాం కదా- verb లో రెండు, అంతకంటే ఎక్కువ మాటలుంటే మొదటి మాట, Helping verb, మిగతా మాటలన్నీ Main verb అవుతాయని.
Look at this question:
Where is he going?
('wh' word) + Helping verb + Sub + Main verb.
'wh' question లో కూడా, రెండు అంతకు మించి మాటలున్నప్పుడు, మొదటి మాట, helping verb, మిగతా మాటలు, main verb అవుతాయి.
'wh' question లో కూడా, subject, Helping verb కూ, main verb కూ మధ్య వస్తోంది కదా?
కాబట్టి English లో question అడిగేటప్పుడు గుర్తుంచుకుందాం. 'wh' question లో కానీ, 'non-wh' question లో కానీ, subject ఎప్పుడూ, verb తర్వాత కానీ, Helping verb తర్వాత కానీ వస్తుంది.
Another point. Remember (గుర్తుంచుకోండి.)
Answer yes/no తో మొదలయ్యిందా? లేక statement రూపంలో ఉందా?
The answer to a 'wh' question is always a statement; the answer to a 'non- wh' question is always begins with 'yes' or 'no'.
★★★★★Next Lesson Tomorrow★★★★★