నిత్యజీవితంలోని సందర్భాల్లో తరచూ వాడే మాటలను Englishలో చూద్దాం.
Get up = నిద్ర లేవడం (wake up కాస్త పాండిత్యం).
Brush (teeth) = పళ్లు తోముకోవడం
Have a bath = స్నానం చేయడం
Have breakfast/ lunch/ dinner/ coffee/ tea/ milk etc.
ఇలాంటి చోట్ల 'have' బదులు take కూడా వాడవచ్చు. కానీ వ్యవహారికంగా have better. రోజూ తీసుకునే Breakfast, lunch, dinner లాంటి వాటి ముందు 'a/ an, the' ఉపయోగించం.
Get ready/ be ready = తయారవడం
cook = వంట చేయడం
అయితే ప్రత్యేకంగా breakfast, lunch, dinner లాంటివి లేదా ఏదైనా ప్రత్యేక వంటకం చేయడం లాంటి వాటికి make/ prepare పదాలను వాడతాం.
Mom is making breakfast.
We are preparing/ making some special dishes for our picnic. (పిక్నిక్ కోసం మేం ప్రత్యేకమైన వంటకాలు (తయారు) చేస్తున్నాం.)
గమనించండి: మామూలుగా వంట చేయడం = cook, ఏదైనా ప్రత్యేకమైన వంటకాన్ని (dish) తయారు చేయడం 'make'/ 'prepare'.
She is cooking = ఆమె వండుతోంది.
She is making dinner = ఆమె రాత్రి భోజనానికి కావాల్సినవి వండుతోంది.
Dinner = రోజులో ముఖ్యమైన భోజనం - సామాన్యంగా ఇది మనకు రాత్రి భోజనం అవుతుంది.
Lunch = మధ్యాహ్న భోజనం.
Supper - English వాళ్లు రాత్రిపూట చేసే భోజనం - వాళ్లకు dinner సామాన్యంగా సాయంత్రం అయి పోతుంది. మళ్లీ రాత్రి ఎప్పుడయినా ఆకలేస్తే తినేది supper - ఇది రోజూ 'భోజనం'లా ఉండకపోవచ్చు - మామూలుగా 'ఫలహారం' ఉంటుంది.
Chew = నమలడం;
Swallow = మింగడం;
Suck = 1) పీల్చడం 2) చప్పరించడం;
Gulp = (ద్రవపదార్థాలను) గుక్కలో మింగడం;
Throwout = వాంతి చేసుకోవడం (Vomit కాస్త lookish);
Spit = ఉమ్మడం (PT and PP - Spat)
Spittle = ఉమ్ము
Tasty = రుచికరమైన.
Sweat = చెమట/ చెమటోడ్చి పని చేయడం
He is sweating = అతడికి చెమట పోస్తోంది.
* I am sweating, please turn on the fan.
నాకు చెమట పోస్తోంది, కాస్త ఫ్యాన్ వేయండి.
Prasad: How long have you been here? (ఎంతసేపటి నుంచి ఉన్నావిక్కడ/ ఉన్నావు నువ్వు?)
Subhash: For about 15 minutes. (15 నిమిషాలుగా)
Prasad: When were you here last? (కిందటిసారి ఎప్పుడున్నావిక్కడ?)
Subhash: Last Sunday. (గత ఆదివారం.)
Subhash: He has been my friend for the past five years. (అయిదేళ్లుగా అతడు నా స్నేహితుడు)
Prasad: How? (ఎలా?)
Subhash: I have been his roommate since 2005. (2005 నుంచి నేను తన roommate గా ఉన్నాను.)
మనం ఇంతకు ముందు తెలుసుకున్నది:
Was/ were = గతంలో ఉండటం
am/ is/ are = ఇప్పుడు/ ఎప్పుడూ ఉండటం
ఇప్పుడు పై సంభాషణలోని ఈ sentences ను చూడండి:
1) How long have you been here?
Verb: Have been (Be form)
2) He has been my friend for the past five years.
Verb: Has been (Be form)
3) I have been his roommate since 2005.
Verb: have been
ఇక్కడి Verbs: have been, has been.
ఇవికూడా 'be' forms -అంటే ఉండటాన్ని తెలుపుతాయి.
గతంలో ఉండటం - was/ were,
ఇప్పుడు ఉండటం - am/ is/ are కదా?
గతం నుంచి ఇప్పటివరకు ఉండటం/ ఇంకా ఉండటం = I/ we/ you/ they have been; He/ she/it has been.
a) మేం నిన్న ఇక్కడ ఉన్నాం. (We were here yesterday.)
మేం ఇప్పుడిక్కడ ఉన్నాం. (We are here)
మేం నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం. (We have been here since yesterday.)
Since = గతంలో ఒక సమయం నుంచి.
Since yesterday = నిన్నటి నుంచి
b) Tendulkar (he) was a cricketer in 1989 + Tendulkar (he) is a cricketer even now = Tendulkar (he) has been a cricketer since 1989. (టెండూల్కర్ 1989 నుంచి క్రికెటర్‌గా ఉన్నాడు.)
* She was my classmate at school. (స్కూల్లో నాకామె classmate) + She is even now my classmate (ఇప్పుడు కూడా ఆమె నా classmate) = She has been my classmate since our school (స్కూల్ నుంచి ఇప్పటి వరకూ/ ఇంకా మేం classmates గా ఉన్నాం)= We have been classmates since our school (School నుంచి మేం classmates గా ఉన్నాం ఇప్పటివరకూ/ ఇంకా).
for the past/ last = గత కొంతకాలంగా.
Since 2005 = for the past/ last 5 years (2005 నుంచి) = (గత అయిదేళ్లుగా)
* India has been independent since 1947 = India has been independent for the past 63 years.
Since 1947 = 1947 నుంచి
For the past 64 years = 64 ఏళ్లుగా
ఈ since కు, for the past/ for the last కూ తేడా గుర్తుంచుకోండి.
since = గతంలో ఒక సమయం నుంచి - ఒక సంవత్సరం నుంచి (since 2004), ఒక నెల నుంచి (since October), ఒక వారం/ రోజు నుంచి (since Monday/ Tuesday, etc)
ఒక సమయం నుంచి (since 10 this morning), ఒక తేదీ నుంచి (since the 20th of last
month), etc.
for ఎప్పుడూ ఒక విరామానికి. for the past last two years/ two months/ two hours/ ten min-utes etc.
was/were -- in the past (గతంలో )
am/is/are -- now (ఇప్పుడు)
I/ we/ you/ they/ have been: he/ she/ it has been [from the past till now (గతం నుంచి ఇప్పటివరకూ)/ ever now (ఇంకా)]
Put the following in English (Exercise No. 2)
Learn the following:
Raja Ram: నేను గత వారమంతా చెన్నైలో ఉన్నాను.
Srinivas: నువ్వక్కడ ఎందుకున్నావు?
Raja Ram: గత రెండు వారాలుగా కంపెనీ వ్యవహారాల (Company matters/ Company affairs) తో తీరిక లేకుండా (busy) ఉన్నాను. మా boss గత వారం చెన్నైలో ఉన్నాడు. అందుకే నేనూ అక్కడ ఉన్నాను.
Srinivas: మా అబ్బాయి (My son) కూడా ఇప్పుడక్కడే ఉన్నాడు. గత మూడురోజులుగా అక్కడే ఉన్నాడు.
Raja Ram: మళ్లీ ఎప్పుడు ఉంటాడిక్కడ?
Srinivas: ఏదో తన business వ్యవహారాల (matters/ affairs) కు సంబంధించి అక్కడ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులుంటాడు అక్కడే.
Raja Ram: ఈ company లో అతడెంత కాలంగా ఉన్నాడు? (How long ? = ఎంత కాలంగా?)
Srinivas: వచ్చేనెల మొదటి తేదీకి మూడేళ్లు అవుతుంది?
How long? = ఎంతకాలం?
How far? = ఎంత దూరం?
a) How far is your school from your home? (మీ ఇంటి నుంచి మీ బడి ఎంత దూరం?)
b) How long will you be here? (నువ్విక్కడ ఎంతసేపు/ ఎంతకాలం ఉంటావు?)
Learn the following words:
Anger = కోపం,
Angry = కోపంగా ఉన్న
love = ప్రేమ/ ప్రేమించడం;
hate = dislike = ద్వేషించడం
joy = సంతోషం = happiness:
feel = భావించడం
emotion = ఉద్రేకం/ ఆవేశం
calm = ప్రశాంతత/ ప్రశాంతమైన
pity = జాలి/ దయ
kindness = దయ
cruel = క్రూరమైన
cruelty = క్రౌర్యం
sympathy = సానుభూతి
sympathetic = సానుభూతితో
affection = ఆపేక్ష
surprise = ఆశ్చర్యం/ ఆశ్చర్యపరచడం
Sincere = చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా
Try to use the words above in your own sentences:
Some examples are given below.
1) Anger is not good quality.
2) Gandhi was never angry (Never = ఎప్పుడూ లేదు/ కాదు).
3) Students hate homework.
4) Duryodhana had a hatred for Pandavas = Duryodyana hated Pandavas.
5) She dislikes him = అతడంటే ఆమెకిష్టం లేదు.
6) The news gave me joy/ happiness
7) I feel happy = నేను సంతోషపడుతున్నాను.
Try the rest of the words = మిగతావి మీరు ప్రయత్నించండి.🙋♂