Sachin is a cricketer - ఇక్కడ verb: is (ఉన్నాడు) -
సచిన్ క్రికెటర్ (గా ఉన్నాడు) - ఇది ఉండటాన్ని తెలిపేది కాబట్టి, is అనే 'be' form వస్తుంది.
Sachin plays cricket - ఇక్కడ verb - plays = ఆడతాడు - పని. కాబట్టి ఇది actionword.
ఇప్పుడు అన్ని 'be' forms అర్థం - వాటి ఉపయోగం చూద్దాం.
కేవలం 'be' formsనే వాడి English లో 30 శాతం conversation (సంభాషణ) నడిపించవచ్చు.
Am, is, are, was, were - ఈ 'be' forms గురించి ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా? ఇప్పుడివి చూడండి.
Shall be/ will be - future states of being (ముందు కాలంలో ఉండటం)
I shall be there tomorrow. (రేపు నేనక్కడ ఉంటాను.)
He will be an Engineer soon. (అతడు త్వరలోనే ఇంజినీర్‌గా ఉంటాడు.)
Modern English speech లోshall be వాడకం బాగా తగ్గిపోయింది. English వాళ్లు ఎక్కువగా will be ఉపయోగిస్తున్నారు.
There will be elections next year. (వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉంటాయి.)
ఈ lesson మొదట్లో ఇచ్చిన conversation లోని మాటలు చూద్దాం.
When will they be here again?
[వాళ్లు మళ్లీ ఇక్కడ ఎప్పుడుంటారు? (will be - be form) ]
Would be = గతంలోంచి భవిష్యత్‌లో ఉండే విషయం.
a) I will be there tomorrow (నేను రేపక్కడ ఉంటాను.)
b) I told them (వాళ్లతో గతంలో చెప్పాను) that I would be there (నేను అక్కడ ఉంటానని).
Sentence (b)లో నేను చెప్పాను (గతంలో) అక్కడ ఉంటానని - ఇక్కడ would be = గతంలో అనుకునే భవిష్యత్ గురించి.
Should be = must be = have to be/ has to be = ఉండాలి.
You should be/ must be/ have to be at school by 10.
(పదింటికల్లా నువ్వు schoolలో ఉండాలి.)
She has to be at home by 8. (ఎనిమిదింటికల్లా ఆమె ఇంట్లో ఉండాలి.)
ఇది గమనించండి: Have = has
అయితే I, we, you and they (వాళ్లు/ అవి)తో have అంటాం. He, She, It తో has అంటాం.
ఇప్పటి వరకూ మనం verb ను గురించి తెలుసుకున్న విషయాలు
1) am/is/ are = ఉండటం, (ఇప్పుడు/ ఎప్పుడూ/ మామూలుగా)
2) Was/ were = గతంలో ఉండటం
b) Shall be/ will be = భవిష్యత్ లో ఉండటం
c) Would be - past future (గతం నుంచి భవిష్యత్ చెప్పేందుకు)
d) Should be/ must be/ have to be/ has to be = ఉండాలి.
Verbs
1) Be forms (ఉండటాన్ని గురించి తెలిపేవి )
2) Action words (పనులను గురించి తెలిపేవి. Eg: do, come, do, take, give, etc..)
ఇప్పుడు ఈ Exercise చేయండి:
ఇవన్నీ 'be' forms కు సంబంధించినవే.
Pat the following English.
1) అతడు ప్రతిరోజు ఇక్కడ ఉదయం ఏడింటికి ఉంటాడు.
2) ఫస్ట్ షో ప్రతిరోజు 6.15కు
3) వాళ్లెప్పుడుంటారు school లో?
4) మీ class ఎప్పుడు (ప్రతిరోజూ)?
5) మీరు రేపు అక్కడ ఉంటారా?
6) వచ్చే జూన్‌కు మీ వయసెంత (ఉంటుంది)?
7) నిన్న వాళ్లిక్కడ ఉన్నారా?
8) అతడు వచ్చే సంవత్సరానికి 20 ఏళ్లవాడిగా ఉంటాడు
9) అతడు పదింటికి ఇక్కడ ఉండాలి.
గమనించండి - తెలుగుకూ English కూ ఉన్న తేడా:
The book is on the table = పుస్తకం table మీద ఉంది. తెలుగులో Table తర్వాత 'మీద' వస్తోంది. కదా? English లో అది table ముందు, on (మీద) వస్తోంది కదా?)
Answers:
1) He is here at 7 every morning (Spoken English లో AM/ PM వాడం. Morning/ Evening etc అని అంటాం. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు వాటినీ వదిలేస్తాం.)
* Our class is at 10 every day.
సామాన్యంగా రాత్రి 10 గంటలకు తరగతులు ఉండవు కదా? అందుకే at 10 అంటే చాలు.
2) The first show is at 6.15 everyday.
First, Second, Third, etc ముందు, 'the' కచ్చితంగా వాడాలి
3) When are they at school?
(Question కాబట్టి subject 'they' ముందు verb వస్తుంది.)
4) When is your class (every day)?
ఇది కూడా question.
5) Will you be there tomorrow?
Question లో రెండు, మూడు మాటలున్న verb వాడాల్సి వస్తే - [ఇక్కడిలా will be] - verb లో మొదటి మాట ముందు తర్వాత subject వస్తాయి.
6) What will be your age/ What will your age be by next June?
7) Were they here yesterday?
8) He will be 20 (Years old) next year.
9) He must be/ should be/ has to be here at 10.🙋♂