English is very easy
★★★★★★★★★★★
➤ Abhiram: Hi Aparna, these mangoes are from my friend's garden. They are really tasty. I have brought them to you. (హాయ్. అపర్ణా! ఈ మామిడి పళ్లు మా స్నేహితుడి తోటలోవి. చాలా రుచిగా ఉన్నాయి. నీ కోసం తెచ్చా.)
➤ Aparna: Really! Thank you. Their smell itself is sweet. Are they for me really? (నిజంగా! వాటి వాసనే తియ్యగా ఉంది. నిజంగా అవి నాకోసమేనా?)
➤ Abhiram: Where is dad? I want him to enjoy them too. (నాన్నగారు ఎక్కడ? ఆయన కూడా వాటిని తినాలని నా కోరిక.)
➤ Aparna: How sweet, this mango is! Dad is having a bath. He will come and eat them. Don't worry. (ఈ పండెంత తియ్యగా ఉందో! నాన్నగారు స్నానం చేస్తున్నారు. వచ్చి తింటారులే. బాధపడకు.)
➤ Abhiram: Here he is. Dad, something sweet for you. Here are very sweet mangoes. Have a bite. (అదిగో వచ్చారు. నాన్నా, మీకో తియ్యటి విషయం. ఇక్కడ చాలా తియ్యని మామిడి పండ్లున్నాయి. రుచి చూడండి.)
➤ Aparna: They are excellent. How I wish I could eat the whole lot! (చాలా బాగున్నాయి. మొత్తం తినేయాలని కోరికగా ఉంది.)
★★★★★★★★★★★
చూశారు కదా, Spoken English కు sample? Spoken English అంటే మనం దైనందిన (Daily) జీవితంలో మాట్లాడే/ సంభాషించే English.
ఇది రెండు రకాలుగా ఉండొచ్చు.
i) Formal English - మనకు పరిచయం లేని వాళ్లతో, మనకంటే పెద్దవాళ్లతో, పై అధికారులతో, ప్రసంగాలు (Speeches) చేసేటప్పుడు మాట్లాడే English.
ii) Informal English - మనకు బాగా పరిచయం ఉన్న వాళ్లతో, మన ఇంట్లో వాళ్లతో, మన స్నేహితులతో మాట్లాడే English.
ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. Spoken English బాగా మాట్లాడగలగడం అంటే formal and informal సందర్భాల్లో మాట్లాడగలగడం.
అయితే మనం ఇప్పుడు Informal సందర్భాల్లో English ఎలా మాట్లాడాలో మొదట తెలుసుకుందాం. మన informal తెలుగు ఎలా ఉంటుంది? చాలా వ్యావహారికంగా ఉంటుంది కదా?
చాలా సరళంగా (simple), సూటిగా (direct), తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని తెలియచేయగలగడం. Informal Spoken English కూడా అంతే. చాలా simple గా, direct గా, short and clipped sentences తో సహజంగా (పుస్తకాల నుంచి నేర్చుకుని మాట్లాడుతున్నట్లు కాకుండా) ఉండాలి.
అప్పుడు మన Spoken English వినసొంపుగా ఉంటుంది.
★★★★★★★★★★★
English మాట్లాడాలంటే Grammar బాగా తెలుసుకోవాలి. అయితే Grammar తెలిసినంత మాత్రాన, English బాగా మాట్లాడటం, రాయడం సాధ్యం కాదు.
చాలామంది Grammar తెలియకపోయినా మంచి English మాట్లాడగలరు. భాష మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత బాగా వస్తుంది. The best way to learn a language is to speak it అంటారు. అంటే భాష నేర్చుకునేందుకు ఉత్తమమైన మార్గం దాన్ని మాట్లాడటమే. అందుకని మనం - అంటే, English బాగా మాట్లాడాలనుకునే వాళ్లం, వీలైనంతవరకూ English మాట్లాడదాం. మాట్లాడిన కొద్దీ బాగా మాట్లాడగలం.
మనలో చాలామంది English కొంత మాట్లాడగలిగినా మాట్లాడలేరు. ఎందుకని?
1) మనం తప్పులు చేస్తే ఇతరులు నవ్వుతారన్న భయంతో;
2) English మాట్లాడితే ఇతరులు మనం ఫోజు కొడుతున్నా మనుకుంటారని భయం.
ఈ రెండు మర్చిపోండి.
కాస్త English అర్థం చేసుకునే వాళ్ల మధ్యలో ఉంటే English మాత్రమే మాట్లాడండి. తప్పులు చేస్తామనే భయం అక్కర్లేదు. తప్పులు అందరూ చేస్తారు. తప్పులతోనైనా మాట్లాడండి. ఎవరైనా మన తప్పు చూపించి సరైందేంటో చెబితే నేర్చుకోవడంలో తప్పు లేదు కదా? అందుకని ఇప్పటినుంచే మీకు వచ్చిన Englishలో నిర్భయంగా మాట్లాడటం ప్రారంభించండి.
Vocabulary: English ఏ సందర్భంలో మాట్లాడేందుకైనా Vocabulary తగినంత ఉండాలి. Vocabulary అంటే ఓ భాషలోని మాటలు (Words)/ పదాలు. రోజూవాడే English మాటలు ఓ 3000 ఉన్నాయి. అవి తెలుసుకోవడం చాలా అవసరం. అవి కూడా ఈ పాఠాలతో మీకు వివరిస్తాం.
Listening(వినడం): ఇతరులు మాట్లాడే English కూడా మనం అర్థం చేసుకోగలగాలి; అప్పుడే మనం ఇంకా బాగా మాట్లాడగలం. అందుకే వీలున్నప్పుడల్లా English News Telecasts(T.V.లో) వింటూ ఉండండి.
Reading: మంచి English మాట్లాడాలి అంటే వీలైనంత English చదవాల్సిందే. రోజూ English Newspaper, Preferably The Hindu చదవండి, అర్థం అయినా కాకపోయినా. తర్వాత మెల్లమెల్లగా అర్థం అవడం ప్రారంభమై, అక్కడి English మాటల వాడకాలు మీరూ ప్రయోగించడం ప్రారంభిస్తారు.
ఇవన్నీ మీరు పట్టుదలతో చేయగలిగితే English లో సునాయాసంగా మాట్లాడగలరు. English మాట్లాడటం, అంటే Spoken English చాలా సులభం. మనం త్వరలోనే మాట్లాడగలం అనే సుముఖ వైఖరి (Positive Attitude) తో ఆరంభించండి. మీకే ఆటంకం ఉండదు. రోజూ కింది మంత్రం పఠించండి.
1. English is very easy.
(English చాలా సులభం)
2. I can speak English.
(నేను ఇంగ్లిష్ మాట్లాడగలను.)
3. I will speak English.
(ముందు ముందు నేను ఇంగ్లిష్ బాగా మాట్లాడతాను - ఇది నా నిర్ణయం)
Let me start NOW (మాట్లాడటం ఇప్పుడే ప్రారంభిస్తాను.)
ఈ మంత్రం మీరు రోజూ పఠించండి. దానికి తగిన కృషిచేయండి. మీరు త్వరలోనే చక్కగా మాట్లాడగలరు.